పదహారణాల తెలుగమ్మాయిలా రెడీ అయిన యంగ్ హీరోయిన్.. రెండు కళ్లు సరిపోవట్లేదంటూ నెటిజన్స్ కామెంట్స్

పిల్ల బాగుంటది కాని అదృష్టం లేదు

‘నన్ను దోచుకుందువటే’(Nannu Dochukunduvate) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ నభా నటేష్(Nabha Natesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత ‘అదుగో’(adhugo) చిత్రంలో నటించినప్పటికీ అంతగా ఫేమ్ తెచ్చుకోలేక పోయింది. కానీ లవర్ బాయ్ రామ్ పోతినేని నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’(Ismart Shanker) మూవీతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ‘డిస్కో రాజా’(disco Raja), ‘సోలో బ్రతుకే సో బెటర్’(Solo Brathuke so Better), ‘డార్లింగ్’(Darling) వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.ప్రస్తుతం నిఖిల్(Nikhil) సరసన ‘స్వయంభు’(Swayambhu) మూవీలో నటిస్తోంది. అలాగే సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన అందచందాలతో కుర్రకారుకు అందాల విందును వడ్డిస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా నభా నటేష్ తన ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో పదహారణాల తెలుగు అమ్మాయిలా చీర కట్టుకొని, జడ అల్లుకుని, గాజులు వేసుకుని దర్శనమిచ్చింది. దీంతో ఈ ఫొటోస్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు నీ అందం తరించడానికి రెండు కళ్లు సరపోవట్లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *