కుబేర సినిమాలో నాగార్జున పోషించిన పాత్ర ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంది.

టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో, టాలీవుడ్ కింగ్ నాగార్జున మరియు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా “కుబేర”.

టాలీవుడ్ కింగ్ నాగార్జున మరియు కోలీవుడ్ స్టార్ ధనుష్ లీడ్ రోల్స్ లో నటించిన “కుబేర” చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఫిమేల్ లీడ్‌గా కనిపించగా, జిమ్ సర్బ్, దిలీప్ తాహిల్, షాయాజీ షిండే వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.

రిలీజ్‌కు ముందే ఈ సినిమా మీద ఆడియన్స్‌లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రేక్షకులు సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. దీనికి ప్రధాన కారణం ప్రమోషనల్ కంటెంట్. మేకర్స్ విడుదల చేసిన ప్రతి అప్డేట్‌కు చక్కటి స్పందన లభించడంతో, సినిమా చుట్టూ మంచి బజ్ క్రియేట్ అయింది. పైగా నాగార్జున కీలక పాత్రలో నటించడం కూడా కుబేరపై అందరి దృష్టిని సారించింది.

ఇప్పటికే సినిమా విడుదలై, ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ అందుకుంటోంది. “కుబేర” ఫుల్ పాకేజీ ఎంటర్‌టైనర్‌గా అభిమానులను మెప్పిస్తుండగా, సినిమాపై పొగడ్తల వర్షం కురుస్తోంది. అదే సమయంలో నాగార్జున పోషించిన పాత్ర గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. సీబీఐ ఆఫీసర్‌గా కనిపించిన ఆయన, పాత్రలో ఒదిగిపోయి అద్భుతంగా నటించారంటూ ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే – ఆ పాత్రను జీవించేశారని నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు.

ఇలా నాగార్జున పాత్ర సినీ ఇండస్ట్రీలో “టాక్ ఆఫ్ ది టౌన్”గా మారింది. దీపక్ అనే పాత్రలో రెండు విభిన్న కోణాల్లో కనిపించడం విశేషం. ప్రారంభంలో నెగెటివ్ షేడ్స్‌లో కనిపించిన ఆయన, తర్వాత పాజిటివ్ వేరియేషన్‌తో మెప్పించారు. నిజానికి, టాలీవుడ్ టాప్ హీరో అయిన నాగార్జున ఓ కథానాయకుడి పక్కన కీలక పాత్ర చేయడం నిజంగా గొప్ప విషయం.

టాప్ హీరోగా సక్సెస్‌ఫుల్ కెరీర్ కొనసాగిస్తున్న నాగార్జున garu, “కుబేర”లోలాంటి చిత్రంలో కీలక పాత్రను పోషించడం ఆయనకు ఉన్న సినిమా పట్ల అంకితభావాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ఈ సినిమాకోసం చేసిన త్యాగం కూడా గొప్పదేనని చెప్పాలి. పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉన్నా, తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తూ, కథకు తగ్గట్టు తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. విమర్శకుల నుంచే కాకుండా, ఆడియన్స్ నుంచి కూడా ప్రశంసలు అందుకుంటున్నారు.

ఇక నాగార్జునకు రొమాంటిక్ ఇమేజ్ ఉన్న విషయం తెలిసిందే. ‘మన్మధుడు’, ‘కింగ్’ వంటి ట్యాగ్‌లతో ప్రసిద్ధి పొందిన ఆయన, ఈ సినిమాలో మాత్రం వాటన్నిటినీ పక్కన పెట్టి దీపక్ పాత్రలో పూర్తిగా నెమ్మదిగా, వాస్తవికంగా నటించారు. డీ-గ్లామర్ లుక్‌లో కూడా ఆకట్టుకున్నారు. కొన్ని సన్నివేశాల్లో కళ్లతోనే భావోద్వేగాలను వ్యక్తం చేయడం విశేషం. కత్తిమీద సాముగా ఉండే ఈ పాత్రను తనదైన స్టైల్‌లో ఆవిష్కరించి ప్రేక్షకులను ఫిదా చేశారు. అసలైన విషయం చెప్పాలంటే – నాగ్ టాలెంట్ మాత్రం లెవెలే వేరుగా ఉందని చెప్పకుండా ఉండలేం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *