
తమిళంలో సూపర్ హిట్టైన “Garudan” సినిమాను తెలుగులో “భైరవం” అనే పేరుతో రీమేక్ చేశారు. బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాని కె.కె. రాధామోహన్ శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించారు. గతంలో “నాంది”, “ఉగ్రం” వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన విజయ్ కనకమేడల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శంకర్ కుమార్తె అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్ళై హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనే విషయాలను ఇప్పుడు రివ్యూలో చూద్దాం.