జేఏసీతో జరిగినవి చర్చలే అంటారా

గతి లేని మొగుణ్ణి కట్టుకుని శృతి లేని కాపురం చేసినట్లుంది ఈ మొనగాళ్ళ జేఏసీ మొండి మొగుడు రేవంత్ రెడ్డి govt తో వ్యవహారం, అవ్వ నవ్వి పోదురు గాక నాకేమిటి సిగ్గు!!!అనుకుంటున్నారెమో బహుశా—–JAC ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాల నాయకులు, కొండంత రాగం తీసి తీసి, చివరికి మాయ రోగంతో సచ్చినట్లుంది చూస్తుంటే,,,,ఇచ్చిన, తెచ్చిన ఒక్క DA తో, అరునెల్ల తరువాత మరో DA ఇస్తాం అంటే మెదళ్లు మొద్దు బారిన ఈ నాయకులు మోరాయించ లేదెందుకు? 5పెండింగ్ DA ల్లో ఒక్కటి బిచ్చమేస్తే, మరోటి మరో ఆరు నెలలకు అంటే అదేJAC మాభాగ్యం అనుకుందా!!PRC మాటే మరిచి పోయిండ్రా? మాకెందుకు లే PRC అని వదిలేసి ఖడ్గ తిక్కనోలే మడమ తిప్పినారా!! రిటైర్ అయిన వేలాది ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన డబ్బులు వెంటనే ఇవ్వాలని అడగలేకపోయిండ్రా,

పెండింగ్ బిల్స్ కు నెల నెలా 700కోట్లని ఇంతకు ముందంటూనే వస్తూ మొండి చెయ్యి చూపుతూనే వస్తున్నదే కదా మళ్ళీ కొత్త మాటేముంది అందులో, ఎన్నికల్లోఈ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను , మేనిఫెస్టోను ఏ ఒక్క నాయకుడూ ప్రశ్నించ లేదు, సరికదా కనీసం గుర్తు చేయడం కూడాచేయలేదా అంతగా అంట కాగిండ్రా, లేదా వణికి పోయారా ., ఇంకేముంది కృష్ణార్పణం చేస్తిరి కదా, మీ బలం, స్వరం ఏమీ లేదని వట్టోళ్ళమే కాని గట్టొల్లం కాదని చెప్పొస్తిరి కదా!!! మిమ్మల్ని నమ్మి ఎన్నెన్ని ఆశలతో మేమంతా ఎదురు చూస్తిమి, మా జేఏసీ నాయకులను మొనగాళ్ళనుకుంటిమి, పట్టు పట్టితే ప్రభుత్వం మెడలు వంచగలరనీ,అంతటి వారని, ఇంతటి వారని అనుకుంటిమి కదా,మా అందరికి ఒక అనుమానం మీ మీద— రిటైర్మెంట్ ఏజ్ పెంచుతే మీకూ లాభమే కదా అనుకున్నారా, ఆశపడ్డారా, నిరుద్యోగుల సంగతే మరిచి పోయినారా!చివరికి ప్రస్తావనే లేకపోయే సరికి మా, మన అన్ని డిమాండ్లు గాలికొదిలేసి నారా??? ఎంతో ఘన చరిత్ర కలిగిన JAC నే చివరికి నవ్వుల పాలు చేసోస్తిరి కదా!! అయ్యో ఆగం చేసి అవమానం పాలు చేస్తిరి, మా అందరినీ బిచ్చగాళ్ళను చేస్తిరి కదా!! మీ పోరాట లేమికి వందనాలు ., మీ చేతకాని తనానికి శతకోటి.. సిగ్గు పడుథూ రోదిస్తున్నాయి సంఘాలు మీ లాంటి నాయకులున్నందుకు, మిమ్మల్ని కన్నందుకు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *