Lion 🦁 is coming again

బాల‌య్య పుట్టిన రోజు జూన్ 10. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని ఈ మూవీని ప్ర‌క‌టించారు. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో సింహంతో బాల‌య్య‌ను పోలుస్తూ డిజైన్ చేసిన తీరు ఫ్యాన్స్‌కు పూన‌కాలు తెప్పిస్తోంది.

మాసీవ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ల‌ని ఎంచుకుంటూ నంద‌మూరి బాల‌కృష్ణ కెరీర్ ప‌రంగా దూసుకుపోతున్నారు. ప్ర‌స్తుతం అఖండ సీక్వెల్ అఖండ 2’లో న‌టిస్తున్న బాల‌య్య తాజాగా మ‌రో క్రేజీ యాక్ష‌న్ డ్రామాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. గ‌త కొంత కాలంగా మాంచి ఫామ్‌ని కొన‌సాగిస్తున్న బాల‌కృష్ణ ఈ సంక్రాంతికి ‘డాకు మ‌హారాజ్‌’తో వచ్చి బాక్సాఫీస్‌ని షేక్ చేసిన విష‌యం తెలిసిందే

మ‌రో సారి అదే స్థాయిలో త‌న స‌త్తాని చాటేందుకు బ్యాక్‌టు బ్యాక్ సినిమాల‌తో రెడీ అవుతున్నారు. బోయ‌పాటి శ్రీ‌ను డైరెక్ష‌న్‌లో బాల‌య్య న‌టిస్తున్న ‘అఖండ 2’ ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 27న భారీ స్థాయిలో ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కావ‌డానికి రెడీ అవుతోంది. ఈ నేప‌థ్యంలోనే బాల‌కృష్ణ ఆదివారం త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ని ప్ర‌క‌టించేశారు. బాల‌య్య చేయ‌బోతున్న 111వ ప్రాజెక్ట్ ఇది. అందుకే దీనికి వ‌ర్కింగ్ టైటిల్‌గా NBK111 అని పేరు పెట్టారు. దీనికి గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌కుడు.రీసెంట్‌గా స‌న్నీడియోల్‌తో ‘జాట్‌’ మూవీని రూపొందించిన గోపీచంద్ మ‌లినేని ఇప్పుడు బాల‌య్య‌తో ప‌వ‌ర్ ఫుల్ యాక్ష‌న్ డ్రామాకు శ్రీ‌కారం చుడుతున్నారు. వృద్ది సినిమా బ్యాన‌ర్‌పై వెంక‌ట స‌తీష్ కిలారు ఈ మూవీని నిర్మిస్తున్నారు. గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో వెంక‌ట స‌తీష్ కీలారు ‘పెద్ది’ మూవీని నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. ఆ భారీ ప్రాజెక్ట్ అండ‌ర్ ప్రొడ‌క్ష‌న్‌లో ఉండ‌గానే బాల‌య్య‌తో మ‌రో భారీ ప్రాజెక్ట్‌కు శ్రీ‌కారం చుడుతున్నారు.ఇదిలా ఉంటే ఇప్ప‌టికే గోపీచంద్ మ‌లినేని డైరెక్ష‌న్‌లో బాల‌య్య ‘వీర సింహారెడ్డి’ మూవీ చేసిన విష‌యం తెలిసిందే. దీని త‌రువాత మ‌రోసారి గోపీచంద్‌తో క‌లిసి బాల‌కృష్ణ చేస్తున్న రెండవ సినిమా కావ‌డంతో అభిమానుల్లో అంచ‌నాలు తారా స్థాయికి చేరాయి. అయితే ‘వీర సింహారెడ్డి’కి మించి ఈ సినిమా ఉండాల‌ని, బాల‌య్య‌ని మ‌రింత ప‌వ‌ర్ ఫుల్‌గా చూపించాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మేకింగ్ విష‌యంలో రాజీప‌డ‌ని వెంక‌ట స‌తీష్ కీలారు ఈ మూవీని నిర్మిస్తున్నారు.బాల‌య్య పుట్టిన రోజు జూన్ 10. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని ఈ మూవీని ప్ర‌క‌టించారు. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో సింహంతో బాల‌య్య‌ను పోలుస్తూ డిజైన్ చేసిన తీరు ఫ్యాన్స్‌కు పూన‌కాలు తెప్పిస్తోంది. డ్యూటీకి, వ్య‌క్తిగ‌త జీవితాన్న బ్యాలెన్స్ చేస్తూ సాగే ఓ వారియ‌ర్ స్టోరీగా ఈ సినిమా ఉండ‌నుంద‌ని పోస్ట‌ర్‌ని బ‌ట్టి స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ హిస్టారిక‌ల్ మూవీ షూటింగ్‌ని బాల‌య్య అంగీక‌రించిన ప్రాజెక్ట్‌లు పూర్త‌యిన వెంట‌నే మొద‌లు పెట్ట‌బోతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *