పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

పవన్‌లో అనూహ్య మార్పుపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని రోజులుగా రెగ్యులర్‌గా సినిమా షూటింగ్‌ల్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. తన కోసం దాదాపు రెండేళ్లుగా ఎదురు చూస్తున్న మూడు సినిమాలను ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేస్తున్నారు పవన్. ముందుగా గత నెలలో ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ అవగొట్టేశారు. తర్వాత ‘ఓజీ’ సెట్లో అడుగు పెట్టి ఇటీవలే దాని పని కూడా ముగించారు. ఇక ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ఆయన తయారవుతున్నారు. ఇంకో మూడు రోజుల్లోనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రీకరణ కూడా మొదలవుతుందని అంటున్నారు. ఆ సినిమాలో పవన్ చేస్తున్నది పోలీస్ క్యారెక్టర్ అన్న సంగతి తెలిసిందే. ఆ పాత్రకు తగ్గట్లు ట్రాన్స్‌ఫామ్ అవ్వాలని అనుకున్నాడో ఏమో కానీ.. పవన్ లుక్‌లో చాలా మార్పు కనిపిస్తోంది. తాజాగా తన పర్సనల్ స్టైలిస్ట్‌కు చెందిన సెలూన్ ఓపెనింగ్ కోసం నిన్న టీషర్ట్, షార్ట్ వేసుకుని వచ్చిన పవన్ సరికొత్త లుక్‌లో అందరినీ ఆశ్చర్యపరిచాడు. బాగా పరువు తగ్గి ఫిట్‌గా కనిపిస్తున్నాడు పవన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *