అందంతో ఆకట్టుకుంటున్న అక్కినేని కోడలు

“శోభిత ఎంపిక చేసిన ఎరుపు చీర – గోల్డెన్ బ్లౌజ్ కాంబో, వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించింది.

“అక్కినేని కోడలు జైనబ్ రావ్జీ (Zainab Ravdjee) పెళ్లి వేడుకకు హాజరైన అతిథుల్లో అక్కినేని కుటుంబం మొత్తం ఒకే వేదికపై కనిపించడమే ఒక విశేషం అయితే, నాగార్జున పెద్దకొడలు శోభిత ధూళిపాళ-నాగచైతన్య జంట మరొక హైలైట్‌గా నిలిచింది. ఇప్పటివరకు బయటకురాని వారి కొత్త లుక్‌ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ జంట పార్టీ కోసం స్టైలిష్‌గా రెడీ అయిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. చైతన్య డార్క్ కలర్ సూట్‌లో డాషింగ్‌గా కనిపించగా, శోభిత రెడ్ హాట్ శారీలో అల్ట్రా గ్లామరస్ లుక్‌తో అందరినీ ఆకట్టుకున్నారు.”

శోభిత ఎంచుకున్న ఎరుపు రంగు సాదా చీరకు, డిజైనర్ గోల్డెన్ బ్లౌజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముత్యాల అల్లికతో అందమైన బ్రీడ్స్ కలిగిన ఆ బ్లౌజ్ ఆమె అందాన్ని మరింత హైలైట్ చేసింది. సింపుల్ మేకప్, కాటుక కళ్ళతో షార్ప్ లుక్ ఇచ్చిన అక్కినేని కోడలు, తన స్టైలిష్ అటైర్‌తో మ్యాజిక్ చేసింది. చై–శోభిత జంట ఈ వేడుకలో నిజమైన షో స్టాపర్స్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

శోభిత చేతిలో ఉన్న ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్ కూడా ఎరుపు చీరకు మెచ్చిపోయే విధంగా కలర్ కాంబినేషన్ లో స్టైలిష్‌గా కనిపించింది. ఈ విధంగా అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి ముగిసినప్పటికీ, అభిమానుల్లో సందేహాలు మాత్రం మొదలయ్యాయి… ‘చైతన్య తదుపరి ప్రాజెక్ట్ ఏంటి?’, ‘శోభిత కెరీర్ లో నెక్స్ట్ స్టెప్ ఏంటి?’ అంటూ సోషల్ మీడియాలో హీట్ పెరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *