నాయుడుIphone 16 Plus Offer: ఐఫోన్ లవర్స్‌కు బంపర్ ఆఫర్.. ఈ ఫోన్‌పై ఏకంగా రూ.11,900 డిస్కౌంట్ !

మనలో చాలా మంది ఒక్కసారైనా ఐఫోన్ కొనాలని అనుకుంటాం. ఐఫోన్‌లో లభించే అడ్వాన్స్ ఫీచర్స్, ముఖ్యంగా కెమెరా క్వాలిటీ కారణంగా చాలా మంది యువత ఐఫోన్ వైపు మొగ్గు చూపుతారు. ఇక ఐఫోర్ ధరలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అందుకే.. అంత డబ్బు పెట్టి కొనలేని వారు, ఆఫర్ల కోసం వేచిచూస్తారు.

Iphone 16 Plus Offer: ఐఫోన్ 16 ప్లస్ పై రూ.11,900 డిస్కౌంట్ విజయ్ సేల్స్ వెబ్‌సైట్‌లో లభిస్తుంది. 6.7-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్ప్లే, Apple A18 చిప్, 48MP ప్రధాన కెమెరా, 12MP ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇలాంటి వారికోసమే ఇప్పుడొక గుడ్ న్యూస్. ఐఫోన్ 16 ప్లస్ (Iphone 16 plus)పై రూ.11,900 డిస్కౌంట్ లభిస్తుంది. విజయ్ సేల్స్ అధికారిక వెబ్‌సైట్‌లో ఐఫోన్ 16 ప్లస్ పై భారీ డిస్కౌంట్ ఇస్తోంది. సాధారణంగా ఐఫోన్‌లు ఇంత పెద్ద డిస్కౌంట్‌తో లభించవు. మీరు మీ ప్రస్తుత ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయాలనుకుంటున్నా, లేదా మొట్టమొదటిసారి ఐఫోన్‌కు మారాలనుకుంటున్నా, ఈ డీల్ మీకు బెస్ట్ ఆప్షన్

ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ డీల్ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ ఇం‌యాలో రూ. 89,900 ప్రారంభ ధరకు లభిస్తుంది. ప్రస్తుతం, ఇది విజయ్ సేల్స్ అధికారిక వెబ్‌సైట్‌లో రూ. 81,990కి లభిస్తోంది. దీంతో రిటైలర్ ఈ ఫోన్‌పై నేరుగా రూ.7,910 తగ్గింపును అందిస్తోంది. అలాగే, మీరు ICICI బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్, HDFC బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్, AXIS బ్యాంక్ క్రెడిట్ కార్డ్, KOTAK బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై అదనంగా రూ. 4,000 తగ్గింపును పొందవచ్చు.

Apple iPhone 16 Plus స్పెసిఫికేషన్లు, ఫీచర్లుiPhone 16 Plus 6.7-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్ప్లేతో వస్తుంది. ఇది Apple A18 చిప్‌పై నడుస్తుంది. అంతేకాకుండా.. అన్ని Apple ఇంటెలిజెన్స్ ఫీచర్‌లకు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 48 MP ప్రధాన సెన్సార్, వెనుక భాగంలో 12MP అల్ట్రావైడ్ లెన్స్‌తో అమర్చబడి ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం, ఇది 12MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంటుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *