“JAC వేదిక ఒక సామాన్య వేదిక కాదు. ఇది చరిత్రలో గౌరవప్రదమైన పరిపాటి కలిగిన వేదిక. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల హక్కులను సాధించేందుకు ఏర్పడిన అత్యున్నత వేదిక ఇది.
ప్రస్తుతం JAC ముందుంచిన 55 సమస్యలను ప్రభుత్వం ముందు బలంగా ఉంచి, వాటి పరిష్కారం కోసం నిర్దేశితంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఈ పోరాటంలో ఒక్క అడుగు కూడా వెనక్కి తీయకూడదు. JACకి ఉన్న గౌరవం, పరువు, చరిత్ర — ఇవి మాటలకు మాత్రమే కాదు, కార్యాచరణకు నిలబెట్టాల్సిన బాధ్యత మనందరిది.

ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాలు అన్నీ ఈ వేదికలో సమగ్రంగా ప్రతినిధ్యం వహిస్తున్నాయి.
ఒక JAC అంటే — ఇది ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి అత్యున్నత స్థాయిలో ఉండే వేదిక. ఇది కేవలం సమావేశాల కోసం కాదు. ఇది సాక్షాత్ ముఖ్యమంత్రి, మంత్రులు కూర్చునే సమావేశాలకన్నా ప్రాధాన్యం కలిగిన వేదిక.
సమస్యలు బయట అరుపులతో కాదు — JAC వేదికలో ప్రభుత్వం ముందే పెట్టాలి. ప్రభుత్వం చర్చించి, ఒప్పించి, అమలు చేసేలా చేయాలి. జెఏసీ అంటే ప్రజా హక్కుల కోసం పోరాడే, సాధించేదే వేదిక.”
