2014 నుంచి 2023 వరకు గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాలు ఇవే..!

తెలంగాణ ప్రభుత్వం దాదాపు పదకొండేళ్ల తర్వాత నంది అవార్డులను ప్రకటించింది. ఈసారి “గద్దర్ అవార్డులు” పేరుతో అవార్డులను ప్రదానం చేయనున్నారు. రీసెంట్ గానే 2024 కు సంబంధించి అవార్డులను అనౌన్స్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా 2014 నుంచి 2023 మధ్య వచ్చిన సినిమాలకు ఉత్తమ చిత్రం విభాగంలో అవార్డులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజు, జ్యూరీ చైర్మన్ మురళీమోహన్ పాల్గొన్నారు.