ఉస్తాద్ భగత్ సింగ్’ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన హరీష్ శంకర్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో రీజనల్ గా మంచి హైప్ ఉన్న చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్” అని చెప్పాలి. భీమ్లా నాయక్ సినిమా తర్వాత తన నుంచి మరో పోలీస్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రం ఇది వరకే కొంతమేర కూడా కంప్లీట్ అయ్యింది. అయితే ఈ షూటింగ్ మళ్ళీ పునః ప్రారంభం కాబోతుంది అని మేకర్స్ రీసెంట్ గానే మేకర్స్ కూడా అనౌన్స్ చేశారు.ఇక లేటెస్ట్ గా స్వయంగా దర్శకుడు హరీష్ శంకర్ నుంచి కూడా ఒక సాలిడ్ అప్డేట్ వచ్చేసింది. దీనితో లేటెస్ట్ గా హరీష్ శంకర్ మాట్లాడుతూ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఈ జూన్ రెండో వారం నుంచి మొదలు కాబోతుంది అని క్లారిటీ ఇచ్చారు. సో ఉస్తాద్ ఇంకొన్ని రోజుల్లో సెట్స్ లో దిగనున్నాడని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *